హైదరాబాద్, జూన్21 (నమస్తే తెలంగాణ): గ్రూప్1 ప్రిలిమ్స్‌ను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీ ప్రశాంత్ మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టనున్నది. ఓఎంఆర్ షీట్లో హాల్‌టికెట్ నంబర్ లేదని, దీని వల్ల ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉన్నదని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. జూలై 1న గ్రూప్4 పరీక్షలను సక్రమంగా నిర్వహించేలా ఉత్తర్వులివ్వాలని కూడా వారు కోరారు.