హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): గిరిజన ప్రాంతాల్లోని స్థానిక సంస్థలో 100 శాతం సీట్లను గిరిజనులకే రిజర్వేషన్ చేయడం చెల్లదంటూ హైకోర్టులో నాన్ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ మాధవీదేవి.. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని ప్రకటించారు.
రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్లు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ఉన్నందున ఈ వ్యాజ్యాన్ని సీజేకు నివేదించేందుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీ ని ఆదేశించారు. దీంతో ఈ వ్యాజ్యం సీజే బెంచ్ ముందుకు వెళ్లనుంది.