జగిత్యాల, మే 20 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేయాలని తలపెట్టిన యంగ్ ఇండియా స్కూళ్ల లో కుట్ర కోణం కనిపిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఒక్కో స్కూల్ కోసం రూ.200 కోట్ల చొప్పున రూ.28వేల కోట్ల కేటాయింపులను పరిశీలిస్తే మేఘా కృష్ణారెడ్డి లాంటి బడా కాంట్రాక్టర్లకు విందు భోజనం ఏ ర్పాటు చేసేందుకు వ్యూహం పన్నినట్టున్నదని అనుమానం వ్యక్తంచేశారు. యంగ్ ఇండియా స్కూళ్లకు సంబంధించి విధివిధానాలు చెప్పకుండానే రేవంత్‌రెడ్డి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. జగిత్యా లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో 296 రెసిడెన్షియల్ సూల్స్ ఉండగా, తె లంగాణ తొలి సీఎం కేసీఆర్ 613 రెసిడెన్షియల్ పా ఠశాలలను అదనంగా ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 909 గురుకుల పాఠశాలలు విద్యను అందిస్తున్నాయని చెప్పారు. కేసీఆర్‌కు పేరు వస్తుందోనన్న భావనతోనే సీఎం 613 రెసిడెన్షియల్ స్కూళ్లకు శాశ్వత భవనాలను నిర్మించడం లేదని విమర్శించారు. యంగ్ ఇండి యా సూల్ విధివిధానాలు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు ఏ ప ద్ధతిలో చేస్తారు? గత ప్రభుత్వ హయాం లోని రెసిడెన్షియల్ సూళ్లను యధావిధిగా కొనసాగిస్తూ స్థానికంగా శాశ్వత ని ర్మాణాలు చేపడుతారా? సీఎం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ శీలం ప్రియాంకాప్రవీణ్ తదిరతులు పాల్గొన్నారు.