భీమారం, జూన్ 25 : ‘ఉన్నోనికే ఇందిర మ్మ ఇండ్లు ఇస్తున్నారని, ఒక్క ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి ఇండ్లు వచ్చాయని, మా లాంటి పేదల పరిస్థితి ఏమిటి ?’ అని కాంగ్రెస్ నా యకులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు, మాజీ సర్పంచ్‌లు పంచాయతీ కార్యదర్శులను పలు గ్రామాల ప్రజలు నిలదీశారు. డబ్బులు తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్‌లు వచ్చేలా చేశారని ఆరోపిస్తూ మంత్రి వివేక్ ఎదుటే మంచిర్యాల జిల్లా భీమారం మండలకేం ద్రంతోపాటు, ఖాజీపల్లి, ఆరేపల్లి, ఎల్కేశ్వరం గ్రామాల ప్రజలు ఆందోళనచేశా రు. బుధవారం భీమారంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. పైసలు తీసుకొని ఉన్నోనికి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్‌లు ఇచ్చారని ఆరెపల్లిలోని కొందరు గ్రామస్థులు మంత్రి ఎదుటే ఆందోళనకు దిగారు. ప్రొసీడింగ్స్ తర్వాత ఇస్తామని అనడంతో ఆరేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవేందర్ , భీమారం ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి రవిపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో మంత్రి కార్యక్రమం రసాభాసగా మారింది. ఉన్నోనికే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారంటూ కాజీపల్లి కార్యదర్శిని బండి శేఖర్‌తో పాటు, మరో కాంగ్రెస్ నాయకుడిని ఎంపీడీవో కార్యాలయంలో మహిళలు నిలదీశారు.