తాండూరు, ఏప్రిల్ 12: హామీల అమలుపై తాండూరు ఎమ్మెల్యేను నియోజకవర్గ ప్రజలు నిలదీశారు. ‘జై బాపు, జై భీం, జై సంవిధాన్’ పేరుతో కాంగ్రెస్ తలపెట్టిన పాదయాత్రలో భాగంగా శనివారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఓమ్లానాయక్ తండా, తట్టెపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎక్కడంటూ గిరిజన మహిళలతోపాటు ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు. పల్లెల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు ఏదో ఉద్దరించినట్టు తిరగడమేమిటని ప్రశ్నించారు.