నల్లగొండ : సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చూసి పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నియోజకవర్గంలోని చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన పద్మ శాలి సంఘం నుంచి 30 కుటుంబాలు నార్కట్ పల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారికి పద్మశాలి సంఘం భవనం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడు లేని విధంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో జెల్ల యాదగిరి, జెల్ల పురుషోత్తమ్, గంజి నరసింహా, జెల్ల వెంకటేశం, రాపోలు అండాలు, జెల్ల మీనమ్మ, జెల్ల అనంతరాములు, తదితరులు ఉన్నారు.