చందూర్, జూన్ 18: సర్కారు బడిలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం బిల్లులు చె ల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు నలిగిపోతున్నా రు. దీంతో ఓ కాంట్రాక్టర్ తాను చేసిన పనులకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్లేందుకు యత్నించగా.. విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయని స్థానిక ప్రజాప్రతినిధులు విన్నవించడంతో అలాగే వదిలివెళ్లాడు. నిజామాబాద్ జిల్లా చందూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టర్ రాంచందర్ అభివృద్ధి పనులు చే శాడు. రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేసి మూత్రశాలలకు నీటి సౌకర్యం కల్పించడంతోపాటు నల్లా పైపులు, మోటర్ బిగింపు పనులు నిర్వహించాడు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఇబ్బందులకు గురయ్యాడు. చేసేదిలేక మంగళవారం స్కూల్‌కు వెళ్లిన కాంట్రాక్టర్.. తాను బిగించిన మోటర్‌ను తొలగించాడు. ఎంపీపీ లావణ్య రాంరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు వచ్చి కాంట్రాక్టర్‌కు నచ్చజెప్పే ప్రయ త్నం చేశారు. ఏడాదిన్నర గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోతే బతికేది ఎలా అని రాంచందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందిం చి తమ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశాడు.