రేపు టీఆర్ఎస్లోకి పెద్దిరెడ్డి

హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్‌లో ఈటలకు బీజేపీ అధిష్ఠానం అధిక ప్రాధాన్యమివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. తన అనుచరులు, కార్యకర్తలు, నాయకులతో ఈ నెల 30న తెలంగాణభవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతున్నట్టు బుధవారం వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. దళితుల భూములను అక్రమంగా కాజేసిన ఈటలను పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినా బీజేపీ అధిష్ఠానం పెడచెవిన పెట్టడంతో పెద్దిరెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

