పెద్దపల్లి, మే 16 (నమస్తే తెలంగాణ): రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ డీసీపీగా పనిచేస్తున్న పులిగిల్ల రవీందర్‌ను హైదరాబాద్‌లోని పోలీస్ చీఫ్ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
2019లో పులిగిల్ల రవీందర్ ఇక్కడికి డీసీపీగా బదిలీపై వచ్చారు. డీసీపీ ఆకస్మిక అటాచ్మెంట్ వెనుక రియల్ ఎస్టేట్ ఫిర్యాదులే కారణమని తెలుస్తున్నది.