కోల్‌కతా, జూలై 5: లష్కరే తాయిబా ఉగ్రవాది తలీబ్ హుస్సేన్‌కు బీజేపీతో లింకులపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ పీడీపీ మంగళవారం జమ్ములో నిరసన చేపట్టింది. ఇటీవల జమ్ములో ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్తులు బంధించి పోలీసులకు అప్పగించగా, అందులో ఒకడు బీజేపీ ఐటీ సెల్ చీఫ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఉగ్రవాది వేరే పార్టీకి చెందినవాడై ఉంటే బీజేపీ ఇప్పటికే ఆ పార్టీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేసేదని పీడీపీ పేర్కొన్నది. ఉగ్రవాదిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ నేతలపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. మరోవైపు, కన్హయ్యలాల్ హత్య కేసు నిందితుడితో బీజేపీకి ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరిపించాలని తృణమూల్ కాంగ్రెస్ కోరింది.