నర్సంపేట, డిసెంబర్ 10: సీఎం కప్ క్రీడోత్సవాల ప్రారంభం రోజే అపశ్రుతి చోటుచేసుకుంది. పట్టణంలోని వల్లభ్‌నగర్ మినీ స్టేడియంలో నర్సంపేట మం డలస్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలను ప్రత్యేకాధికారి భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఎంపీడీవో అం బాల శ్రీనివాసరావు, ఎంఈవో కొర్ర సారయ్య, ఎస్జీఎఫ్ఐ జిల్లా సెక్రటరీ సోనబోయిన సారంగపాణి, అసిస్టెంట్ సెక్రటరీ పీడీ స్వామి మంగళవారం ప్రారంభించారు. తొలుత కబడ్డీ క్రీడలను నర్సంపేట జడ్పీహెచ్ఎస్ మోడల్ ఉన్నత పాఠశాల పీడీ కల్వచర్ల శ్రీలతతో పాటు మరో 12మంది వ్యాయామ ఉ పాధ్యాయులు వేర్వేరు కోర్టుల్లో నిర్వహించారు. ఆటలో ఓ విద్యార్థిని మరో విద్యార్థిని నెట్టివేయగా పీడీ శ్రీలత కుడికాలిపైపడడంతో ఆమె కాలు విరిగింది. వెంటనే పీడీని వరంగల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
‘మోత్కూర్’ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ ; చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూర్ ప్రభుత్వ పాఠశాల ఘటనపై జాతీయ మానవ హకుల కమిషన్ సీరియస్ అయింది. తక్షణమే ఘటనపై చర్య లు చేపట్టాలని కలెక్టర్‌కు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గత నెల 29న ముకిపోయిన, పురుగు పట్టిన బియ్యంతో వండి న అన్నం తినలేక 300 మంది విద్యార్థులు పస్తులున్న విషయం విదితమే. ఈ విష యం మీడియాలో ప్రచారం కాగా, కొన్ని చానళ్ల ద్వారా ‘ఇదంతా ప్రతిపక్షాల కుట్ర’ అంటూ ప్రభుత్వం దాటవేస్తున్న క్రమం లో.. ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు జాతీయ మానవ హకుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అనంతరం సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చింది.