SERP Employees | హైదరాబాద్ : తెలంగాణ( Telangana ) లోని సెర్ప్ ఉద్యోగులకు( SERP Employees ) రాష్ట్ర ప్రభుత్వం( TS Govt ) శుభవార్త వినిపించింది. సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్( Pay Scale ) అమలుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెర్ప్ ఉద్యోగుల కనిష్ఠ పే స్కేలు రూ. 19 వేల నుంచి రూ. 58,850లు కాగా, గరిష్ఠ పేస్కేలు రూ. 51,320, రూ. 1,27,310లుగా నిర్ణయించింది. సెర్ప్ ఉద్యోగులకు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పేస్కేలు వర్తించనుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.