హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనపై అప్పట్లో కేసులు పెట్టాలని చూశారని, ఆయన రెచ్చగొట్టడం వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామంచంద్రరావు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన పవన్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘వైఎస్ మీపై కేసులు పెట్టమన్నారని ని రూపించగలరా?’ అని పవన్ సవాల్ విసిరారు. పవన్ చెప్పినట్టు వైఎస్ కేసులు పెట్టాలని ఓ పోలీస్ అధికారి చెప్పినట్టు ‘లై డిటెక్టర్’ ముందు రుజువైతే తనతోపాటు వైఎస్ అభిమానులంతా రూ.10 కోట్లను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కానీ, లేదా పవన్ కోరిన ఏ స్వచ్ఛంద సంస్థకైనా ఇచ్చేందుకు తాము సిద్ధమని చాలెంజ్ చేశారు. పవన్ చేసిన ఆరోపణలు నిజమని నమ్మితే ఈ సవాల్ స్వీకరించాలన్నారు.
2005-2006లో పాలనపైనే వైఎస్సార్ దృష్టి సారించారని, ఆ సమయానికి పవన్ గానీ, ఆయన కుటుంబసభ్యులు కానీ రాజకీయాల్లో లేరన్నారు. పవన్‌కు ఉన్న రాజకీయ అభిమానాన్ని కొలవడానికి 2019 లో రెండు చోట్ల ఓటమి, 2023 తెలంగాణ అసెంబ్లీ, తర్వాత స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు చాలని చురకలంటించారు. యువరాజ్యం అధ్యక్షుడిగా కాంగ్రెస్ నేతల పై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినా.. అప్పటి ప్రభుత్వం కేసు పెట్టలేదన్నారు. తెలంగాణ ఆవిర్భావం రోజు న పవన్ ఆవేశపూరిత ప్రసంగంపై చంద్ర బాబు విచారం వ్య క్తంచేయకపోగా, అక్కడి నేతల మాటల్లో తప్పులు వెతకాన్ని తప్పుబట్టారు.