ఖైరతాబాద్, అక్టోబర్ 7: మూలకణాల దానంతో క్యాన్సర్ రోగుల ప్రాణాలను కాపాడాలని డీకేఎంఎస్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్యాట్రిక్ పాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
మూలకణాల దానంపై మంగళవారం హైదరాబాద్లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ బ్లడ్ క్యాన్సర్, తలసీమియా, అప్లాస్టిక్ ఎనీమియా లాంటి రక్త సంబంధిత వ్యాధులను నయం చేసేందుకు మూలకణాల చికిత్స ఎంతో దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో హెమటాలజిస్ట్ ఎస్కే గుప్తా, మినర్వ మేరీ, నవ్యధాత్రి పాల్గొన్నారు.