గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చే యడంలో ఘోరంగా విఫలమైందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప ట్లోళ్ల శశిధర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్ నుంచి చల్మెడ వరకు బీటీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం 8 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు ప్రజలు దారి పొడువునా స్వాగతం పలికారు.
- నందగోకుల్-చల్మెడ రోడ్డు నిర్మించాలి: పద్మాదేవేందర్‌రెడ్డి
- నందగోకుల్ నుంచి పాదయాత్ర
- పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ శేరి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల
మెదక్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చే యడంలో ఘోరంగా విఫలమైందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప ట్లోళ్ల శశిధర్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్ నుంచి చల్మెడ వరకు బీటీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం 8 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రకు ప్రజలు దారి పొడువునా స్వాగతం పలికారు.
మార్గమధ్యంలో వ్యవసాయ కూలీలు, ప్రజలు వీరికి హారతులు ఇచ్చి స్వాగతించా రు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మా ట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం నందగోకు ల్ గ్రామం నుంచి చల్మెడ కమాన్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 13 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. తర్వాత కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక పనులు నిలిపివేసిందని ఆరోపించారు. కక్షపూరితంగా ప్రభు త్వం బీటీ రోడ్డు పనులు అడ్డుకుంటున్నదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

