హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే అక్కసుతోనే హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి మండిపడ్డారు.
దమ్ముంటే రైతు డిస్కమ్, పంటల కొనుగోళ్లపై హరీశ్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తి నోటికొచ్చినట్టు మాట్లాడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.