హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): గోదావరి బేసిన్‌లోని వివిధ ప్రాజెక్టుల సమగ్ర సమాచారంపై రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఆరా తీశారు. గోదావరి బేసిన్‌కు సంబంధించి ఇంటర్‌స్టేట్ అధికారులు, ప్రాజెక్టుల అధికారులతో బుధవారం జలసౌధలో పాటిల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల వివరాలను, విశిష్టతలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. అంతరాష్ట్ర వివాదాలపై కూడా ఆరా తీశారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం, ప్రాజెక్టు వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అధికారులు వెల్లడించిన ప్రతి అంశాన్ని పాటిల్ నోట్ చేసుకున్నారు. శుక్రవారం కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా భేటీ కావాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసింది.