హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమ స్తే తెలంగాణ): యువత జీవితాలకు ప్రమాదకరంగా మారిన మాదకద్రవ్యాల నివారణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజానాట్యమండలి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై నిర్వహించే అవగాహన వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజానాట్యమండలి నాటక బృందం మాదకద్రవ్యాల నివారణపై విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల వద్ద తమ కళారూపాలను ప్రదర్శించ డం అభినందనీయమని అన్నారు.
ఎక్సైజ్‌శాఖలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయిలో కొన్నేండ్లుగా బ దిలీలు లేవని.. అధికారుల బదిలీలతోపాటుగా హెచ్‌సీ, పీసీల బదిలీలు కూ డా చేపడతామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. గురువా రం సెంట్రల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లన్నగౌడ్ నేతృత్వంలో పలువురు నేతలు మంత్రిని కలిశారు. త్వరలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల బదిలీలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అసోసియేషన్ పక్షాన విజ్ఞప్తిచేశారు. త్వరలోనే బదిలీలు చేపడతాం’ ఆయన అని హామీ ఇచ్చారు.