హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): 2024-25వ సంవత్సరానికి పార్లమెంట్ స్థాయీ సంఘ సభ్యులుగా బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, ఉపనేత వద్దిరాజు రవిచంద్ర, ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, పార్థసారథిరెడ్డి నియమితులయ్యారు. పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ స్టాండింగ్ కమిటీలో కేఆర్ఎస్ , సైన్స్అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల కమిటీలో దీవకొండ , పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కమిటీలో రవిచంద్ర, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో పార్థసారథి రెడ్డిలకు అవకాశం లభించింది.