గిరిజన వర్సిటీ సాకారం!
గిరిజన యూనివర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా చేస్తున్న పోరాటంతో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దిగొచ్చినట్టే కనిపిస్తున్నది. సెంట్రల్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు-2022 పేరుతో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ సోమవారం లోక్‌సభలో గిరిజన యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్‌సింగ్ విడుదల చేసిన బులెటిన్‌లో ఉన్నది
- నేడు పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం
- వర్సిటీ కోసం ఎనిమిదేండ్లుగా తెలంగాణ పోరాటం
- ములుగు జిల్లాలో ఇప్పటికే భూమి కేటాయింపు
- ఎన్నిసార్లు విన్నవించినా ఇన్నేండ్లు కేంద్రం మౌనం
హైదరాబాద్, జులై 31 (నమస్తే తెలంగాణ): గిరిజన యూనివర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా చేస్తున్న పోరాటంతో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దిగొచ్చినట్టే కనిపిస్తున్నది. సెంట్రల్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు-2022 పేరుతో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ సోమవారం లోక్‌సభలో గిరిజన యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్‌సింగ్ విడుదల చేసిన బులెటిన్‌లో ఉన్నది. దీంతో రాష్ట్రంలో ఎట్టకేలకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కావచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

అలుపెరుగని పోరాటం
రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం టీఆర్ఎస్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కేంద్రంపై ఎనిమిదేండ్లుగా పోరాడుతున్నది. సీఎం కేసీఆర్ స్వయంగా కేంద్రానికి ఈ అంశంపై అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీని కలిసి వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్లో కూడా టీఆర్ఎస్ ఎంపీలు ఈ అంశాన్ని అనేకసార్లు లేవనెత్తారు. గిరిజన వర్సిటీ కోసం ములుగు జిల్లా జాకారంలో రాష్ట్ర ప్రభుత్వం 335.04 ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఫైళ్లను సీఎం కేంద్రానికి నివేదించారు. ఉన్నత విద్యాలయాల కేటాయింపులో మోదీ సర్కారు తెలంగాణపై ఇప్పటికే తీవ్ర వివక్ష ప్రదర్శించిందనే విమర్శలున్నాయి. నవోదయ, ఎన్ఐటీ, ఐఐటీ, ఐఐఎం, ఐబీఎం, ఐసర్, ట్రిఫుల్ ఐటీ, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీలు.. ఇలా అనేక విద్యాలయాల ఏర్పాటులో మొండిచెయ్యి చూపింది. ఏపీ విభజన చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చినా గిరిజన యూనివర్సిటీని ఇప్పటికీ కేటాయించలేదు. ఈ విద్యా సంస్థ కోసం మంత్రి కేటీఆర్ గత ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రి అర్జున్‌ముండాకు లేఖ రాశారు.
గిరిజన వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వ చర్యలు
- జనవరి 11, 2019న రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీఎస్డీఎఫ్ (షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) నిధి నుంచి రూ.15 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.
- డీపీఆర్ (డీటెల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) రూపొందించేందుకు 2019-20 బడ్జెట్లో రూ.4 కోట్లు కేటాయించింది.
- తరగతులు ప్రారంభించేందుకు ములుగు జిల్లా, జాకారంలోని గిరిజన సంక్షేమ శాఖ యువ శిక్షణా కేంద్రం (వైటీసీ)ను తాతాలిక ప్రాంగణంగా స్వీకరించాలని కేంద్ర విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. వైటీసీ మరమ్మతులు, ఇతర సౌకర్యాల కోసం రూ.3 కోట్లు కేటాయించి, ఆ విషయాన్ని కేంద్రానికి నివేదించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

