హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన కొత్త బ్రేకప్ వివరాలను టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్టు పేర్కొన్నారు.