ధర్మపురి, ఆగస్టు 1 : విధుల్లో ఉండగా లైవ్ ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉండగా.. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతోనే అటెండెన్స్ వేసుకున్నాడు ఓ కార్యదర్శి. అధికారుల పరిశీలనలో అడ్డంగా దొరికి సస్పెండ్ అయ్యాడు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయ్యపల్లి కార్యదర్శి రాజన్న అదే మండలంలోని సిరికొండ ఇన్చార్జి కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తిస్తున్నాడు. కారోబార్ భీమేశ్ దగ్గ ర ఓ ఫోన్ ఉంచిన కార్యదర్శి జూలై 1, 2 తేదీల్లో విధులకు వెళ్లకుండా ఏదో ఒక ఫొటో యాప్లో అప్లోడ్ చేయాలని చెప్పాడు. దీంతో ఆ కారోబార్ ఏకంగా పంచాయతీ కార్యాలయంలో ఉన్న సీ ఎం రేవంత్ ఫొటోనే తీసి అప్లోడ్ చేశా డు. అధికారులు అటెండెన్స్ పరిశీలించ గా బాగోతం బయటపడింది. కలెక్టర్ సత్యప్రసాద్ సదరు కార్యదర్శిని వివరణ కోరుతూ గురువారం నోటీస్ జారీచేయగా సమాధానం లేకపోవడంతో సస్పెండ్ చేస్తూ త్తర్వులు ఇచ్చారు.
ఎదులాపురం, ఆగస్టు 1 : ఆదిలాబాద్ రూరల్ మండలం యశ్వంత్గూడకు చెందిన పంచాయతీ కార్యదర్శి జగదీశ్ డీఎస్ఆర్పీఎస్లో ఫేక్ అటెండెన్స్ నమోదు చేశారు. గమనించిన ఆదిలాబాద్ డీపీఓ రమేశ్ శుక్రవారం కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మండల పంచాయతీ అధికారికి కూడా షోకాజ్ నోటీస్ జారీ చేశామని, పంచాయతీరాజ్, గ్రామీణ ఉ పాధి కల్పన కమిషనర్ ఆదేశాల మేర కు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.