హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల వేతనాల పెంపుపై ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని పీఆర్సీ చైర్మన్ శివశంకర్‌ను తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షుడు పీ మధుసూదన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం బీఆర్కే భవన్లో పీఆర్సీ చైర్మన్ ఎన్ శివశంకర్‌కు అసోసి యేష న్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
పంచాయతీ కార్యదర్శుల నాలుగు గ్రేడ్లు వేతన సేళ్లను పెంచాలని, ఎఫ్‌టీఏ అలవెన్స్ సదుపాయం కల్పించాలని, గ్రేడ్ ఫోర్త్ సేలు జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్‌కు పెంచాలని కోరారు. గ్రేడ్ 3, 2 పంచాయతీ కార్యదర్శుల సేలు వేతనం పెంచాలని, గ్రేడ్ -1 పంచాయతీ కార్యదర్శులకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పేరు మార్చాలని విన్నవించారు. సమావేశంలో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రమేశ్, ఎంఎస్ఎస్ వాణి, కోశాధికారి జే పండరీనాథ్ ఉన్నారు.