ఎర్రవల్లి చౌరస్తా, నవంబర్ 18: జోగుళాంబ గద్వాల జిల్లాలో సోమవారం పంచాయతీరాజ్ ఏఈ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ కథనం ప్రకారం.. ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడులో రూ. 35 లక్షలతో మైనార్టీ కమ్యూనిటీహాల్ నిర్మించారు. పనులు పూర్తయి 6నెలలు కావస్తున్నా బిల్లులు రావడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు మహ్మద్ హుస్సేన్,జగదీశ్వర్‌రెడ్డి, లాలు, లక్ష్మీనారాయణ బిల్లులు చేయాలని ఏఈ పాండురంగారావును కలిశారు. లక్ష లంచం ఇస్తే. . బిల్లులు పూర్తి చేస్తానని, లేకుం టే లేదని ఏఈ తేల్చి చెప్పాడు. కాంట్రాక్టర్లు 50 వేలు చెల్లించేందుకు అంగీకరించారు. ఎర్రవల్లి చౌరస్తాలోని ఓ షాపులో రూ. 50 వేలు ఏఈకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని విచారిస్తున్నారు.