మార్చి 31న చివరి డెడ్‌లైన్.. ఆధార్‌తో లింకవ్వకపోతే పాన్‌కార్డు చెల్లదు
పాన్‌కార్డుతో ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచేది లేదని ఆదాయ పన్ను శాఖ స్పష్టంచేసింది. మార్చి 31లోగా ఆధార్‌తో లింక్ చేయకుంటే పాన్ కార్డు చెల్లదని స్పష్టంచేసింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: పాన్‌కార్డుతో ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచేది లేదని ఆదాయ పన్ను శాఖ స్పష్టంచేసింది. మార్చి 31లోగా ఆధార్‌తో లింక్ చేయకుంటే పాన్ కార్డు చెల్లదని స్పష్టంచేసింది. తప్పనిసరిగా ఆధార్‌తో పాన్‌ను వెంటనే లింక్ చేయాలని, ఆలస్యం చేయవద్దని ప్రజలకు సూచించింది ఆదాయ పన్ను శాఖ.
ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం పాన్ కార్డు కలిగినవారంతా తప్పనిసరిగా 2023 మార్చిలోగా ఆధార్‌తో అనుసంధానం చేయాలని స్పష్టం చేసింది. లేకపోతే 2023 ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ కార్డు చెల్లదని తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. మరోవైపు, గతంలో కేంద్ర ఆర్థిక శాఖ జారీచేసినట్టు అసోం, జమ్ము అండ్ కశ్మీర్, మేఘాలయ రాష్ర్టాల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు కొనసాగుతున్నదని పేర్కొన్నది. ఒకవేళ పాన్ కార్డు రద్దయితే ఐటీ చట్టం ప్రకారం ఆర్థిక లావాదేవీలు జరిపే అర్హతను కోల్పోతారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) హెచ్చరించింది. అలాంటి వ్యక్తి ఐటీ రిటర్నులు దాఖలు చేయలేరు, పెండింగ్ రిటర్నులు ప్రాసెసింగ్ చేయలేరు, పెండింగ్ రిఫండ్లను కూడా పొందలేడని పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

