హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): 30 శాతం వేతనాలు పెంచినందుకు గోపాలమిత్రలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని టీఎస్ఎల్డీఏ కార్యాలయంలో గురువారం గోపాలమిత్రల సంఘం అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్నదిన వేడుకలు నిర్వహించారు.