IND vs ENG : అంతర్జాతీయ టీ20ల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఓడిపోతున్న భారత జట్టు చావోరేవు పోరుకు సిద్ధమైంది. ఇంగ్లండ్ పర్యటనలో వరసగా రెండు పరాజయాలతో విమర్శలకు గురవుతున్న టీమిండియా.. తొలి విజయంతో సిరీస్‌లో నిలవాలనే కసితో ఉంది. బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ తీసుకున్నాడు. కీలకమైన మ్యాచ్‌లో తాము రెండు మార్పులతో ఆడుతున్నట్టు అయ్యర్ చెప్పగా.. ఇంగ్లండ్ ఒక మార్పు చేసిందని హ్యారీ బ్రూక్ తెలిపాడు.
ఐర్లాండ్ పర్యటనలో వైట్‌వాష్.. ఇంగ్లండ్ గడ్డ మీద వరసగా రెండు ఓటములతో సతమతమవుతున్న టీమిండియా పరువు కోసం ఆడనుంది. టీ20 కెప్టెన్‌గా తొలి విజయం కోసం నిరీక్షిస్తున్న శ్రేయాస్ అయ్యర్‌కు ఈ మ్యాచ్ అగ్ని పరీక్ష కానుంది. భారత్‌కు షాకింగ్ న్యూస్ ఏంటంటే.. తొడకండరాల గాయంతో బాధ పడుతున్న హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తిలు సిరీస్ నుంచి వైదొలిగారు.
అరంగేట్రంలో 14 పరుగులు, ఆపై 13 రన్స్‌కే వెనుదిరిగిన వైభవ్ సూర్యవంశీ ఈసారి శుభారంభంతో రెచ్చిపోవాలని భావిస్తున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న ఆతిథ్య జట్టు మరో విజయంతో సిరీస్‌ను పట్టేయాలనే పట్టుదలతో ఉంది.
🚨 JUST IN: Varun Chakravarthy and Harshit Rana have been ruled out of the remainder of the T20I series against England with hamstring injuries pic.twitter.com/kkDG3dqnj5
— Cricinfo (@cricinfo) July 9, 2026
భారత తుది జట్టు : వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్, ప్రసిధ్ కృష్ణ.
ఇంగ్లండ్ తుది జట్టు : ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బ్యాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, ఆదిల్ రషీద్, ఆర్చర్, జోష్ టంగ్.