Vaibhav Sooryavanshi : జూనియర్ స్థాయిలో ఊచకోతను తలపించే ఇన్నింగ్స్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. సీనియర్ సంజూ శాంసన్ (Sanju Samson)ను కాదని అవకాశమిచ్చినందుకు బ్యాటుతో బదులిస్తాడనుకుంటే.. ఈ చిచ్చరపిడుగు ఫ్లాప్ షోతో ఇంగ్లండ్ పర్యటనలో తేలిపోతున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లో 14.. ఆపై 13 పరుగులతో నిరాశపరిచిన వైభవ్ చావోరేవో పోరులోనూ 15తో సరిపుచ్చాడు. పెద్ద బౌండరీలున్న చోట బంతిని గాల్లోకి లేపి వికెట్ ఇస్తున్న ఈ కుర్రాడు ఈసారి కూడా ఆర్చర్ వ్యూహానికి వికెట్ ఇచ్చేసుకున్నాడు.
ఐపీఎల్ వేరు.. అంతర్జాతీయ క్రికెట్ వేరు అనే మాట మరోసారి నిజమనిపిస్తోంది. మొన్నటివరకూ ఐపీఎల్19లో అంతకుముందు అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో రికార్డు శతకం బాదిన వైభవ్ అరంగేట్రం సిరీస్‌లో దారుణంగా నిరాశపరుస్తున్నాడు.
టీ20 వరల్డ్‌కప్ హీరో సంజూ శాంసన్ ప్లేస్‌లో తుది జట్టులోకి వచ్చిన వైభవ్ చెత్త ఆటతో విమర్శకులకు అవకాశమిస్తున్నాడు. వైభవ్‌ను ఆడించేందుకు ఆలస్యం చేయొద్దు, ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను ఆడిస్తారా లేదా? అని కోచ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను ప్రశ్నించిన వారే ఇప్పుడు చిన్నోడికి ఇప్పుడే మరిన్ని అవకాశాలు వద్దులే అనే పరిస్థితి తెచ్చుకుంటున్నాడీ యంగ్‌స్టర్.
Vaibhav Sooryavanshi’s wait for a breakthrough innings continues, with Jofra Archer dismissing him again pic.twitter.com/a5GiRDXcSC
— Cricinfo (@cricinfo) July 9, 2026
అయితే.. తొలి బంతి నుంచే ఉతికేసి అభిమానులను అలరించిన వైభవ్ ఇంగ్లండ్ నేలపై అదే సూత్రాన్ని అనుసరించడం వల్లనే ఔటవుతున్నాడనేది కాదనలేని వాస్తవం. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన ఆర్చర్.. వైభవ్ బలహీనతలపై దెబ్బకొడుతూ వరసగా ఔట్ చేస్తున్నాడు. ఫలితంగా వరసగా మూడో గేమ్‌లోనూ టీమిండియాకు శుభారంభం దక్కలేదు.
🚨 Vaibhav Sooryavanshi was smashing Jofra Archer in the IPL nets, but now he has gotten out to him twice in three matches.
Jofra Archer knows Vaibhav’s weakness very well, but he didn’t expose it in the IPL. Now he has kept him in his pocket in international cricket.
Vaibhav…
— Indian Cricket Ministry (@Tejashyyyyyy) July 9, 2026
చూస్తుంటే కెరీర్ ఆరంభంలోనే చితక్కొట్టేసి స్థానం పదిలం చేసుకోవాలనుకున్న ఈ బిహార్ కుర్రాడి కల చెదిరేలా ఉంది. ఐదు టీ20ల సిరీస్ అతడికి సత్తా చాటేందుకు ఇంకొక్కటే మిగిలింది. ఈ మ్యాచ్‌లో మెరిస్తే సరి.. లేదంటే అందరిలానే అతడిని పక్కన పెట్టాలనే డిమాండ్లు వచ్చినా ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే.. ఆడితే అందలం.. లేదంటే పాతాళం అన్నట్టుగా వ్యవహరించే బీసీసీఐ వైభవ్‌కు షాక్ ఇచ్చినా ఇస్తుంది.