Wimbledon : వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కరోలినా ముచోవా(Karolina Muchova) సంచలన విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఏడో సీడ్ కొకో గాఫ్(Coco Gauff)ను చిత్తు చేసిన ముచోవా తొలిసారి వింబుల్డన్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గురువారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో గాఫ్‌పై ఆధిపత్యం చెలాయించిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి.. నిర్ణయాత్మక మూడో సెట్లో గెలుపొందింది. దాంతో, మొదటిసారి ఆల్ ఇంగ్లండ్ క్లబ్ టోర్నీలో విజేతగా నిలవాలనుకున్న అమెరికా స్టార్ గాఫ్ కల చెదిరింది.
గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో కరోలినా ముచోవా ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన థ్రిల్లింగ్ సెమీస్‌లో కొకో గాఫ్‌ను ఓడించిన ముచోవా తొలిసారి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. తొలి సెట్ నుంచే దూకుడుగా ఆడిన ముచోవా.. 6-2తో గాఫ్కి షాకిచ్చింది. అయితే.. రెండో సెట్లో పుంజుకున్న అమెరికా టెన్నిస్ స్టార్ 6-1తో పైచేయి సాధించింది.
Karolina Muchova’s moment 💫#Wimbledon pic.twitter.com/8mKli710wj
— Wimbledon (@Wimbledon) July 9, 2026
కానీ, నిర్ణయాత్మక మూడో సెట్లో ముచోవా చెలరేగిపోయింది. ఒకదశలో ఇద్దరూ 10-10 పాయింట్లతో సమంగా నిలిచినా చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ధాటికి గాఫ్ చేతులెత్తేసింది. ఉత్కంఠ రేపిన టై బ్రేక్‌ను 7-6తో గెలచుకున్న ముచోవా ఏడో సీడ్‌ను ఇంటికి పంపింది. రెండో సెమీస్‌లో ఆడుతున్న మార్టా కొత్సుక్, లిండా నొస్కోవాలో ఒకరితో ముచకోవా ఫైనల్లో తలపడనుంది.