ZIM vs BAN : సొంతగడ్డపై జింబాబ్వే రెచ్చిపోతోంది. ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌ను ఇన్నింగ్స్ తేడాతో చిత్తు చేసిన ఆఫ్రికా జట్టు.. ఈసారి వన్డే సిరీస్‌ను పట్టేసింది. రెండో వన్డేలో బెన్ కరన్(111 నాటౌట్) శతకంతో చెలరేగగా.. బౌలింగ్ దళం విజృంభణతో పర్యాటక జట్టును వణికించింది జింబాబ్వే. 248 పరుగుల ఛేదనలో తౌహిద్ హృదయ్(60), తంజిద్(57)లు అర్ధ శతకంతో పోరాడినా.. రిచర్డ్ నగవర(3-55), ముజరబని(33-2), ఎవాన్స్(48-2)ల పేస్ త్రయం ధాటికి మిగతా బ్యాటర్లు తోకముడిచారు. దాంతో, 13 పరుగులతో మట్టికరిపించిన జింబాబ్వే మరో మ్యాచ్ ఉండగానే 2-0తో సిరీస్ గెలుపొందింది.
అంతర్జాతీయ క్రికెట్లో పూర్వ వైభవం దిశగా జింబాబ్వే అడుగులు వేస్తోంది. అనామక జట్టు అనే ముద్రను తొలగించుకుంటూ ఇటీవల సంచలన విజయాలు సాధించిన ఆఫ్రికన్ టీమ్ స్వదేశంలో వరసగా రెండు సిరీస్‌లు గెలుపొందింది. ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన జింబాబ్వే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
1st ODI: Won after being bowled out for 141
2nd ODI: Won after Bangladesh were 207-5 chasing 247A STUNNING SERIES WIN FOR ZIMBABWE! 🇿🇼 pic.twitter.com/7Ef2qPj1zg
— Cricinfo (@cricinfo) July 9, 2026
రెండో వన్డేలో బెన్ కరన్(111 నాటౌట్) చివరిదాకా నిలబడగా.. అనంతరం పేస్ త్రయం పర్యాటక బ్యాటర్ల భరతం పట్టింది. దాంతో, 48.1 ఓవర్లలోనే బంగ్లా కుప్పకూలగా 13 పరుగుల తేడాతో గెలుపొందిన జింబాబ్వే సిరీస్‌ను సొంతం చేసుకుంది. జూలై 11, శనివారం ఇరుజట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే జరుగనుంది.
జింబాబ్వే నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యమేమి పెద్దది కాదు. ఓపెనర్ సౌమ్యా సర్కార్(5)ను ముజరబాని త్వరగానే ఔట్ చేసినా తంజిద్ హసన్(57) దంచేశాడు. నజ్ముల్ శాంటో(9) కూడా విఫలమైనా తౌహిద్ హృదయ్(60)తో కలిసి స్కోర్ బోర్డును ఉరికించాడు తంజిద్. వీరిద్దరు అర్ధ శతకంతో మ్యాచ్‌ను లాగేసుకునేలా కనిపించారు.
🚨 𝗕𝗔𝗖𝗞-𝗧𝗢-𝗕𝗔𝗖𝗞 𝗢𝗗𝗜 𝗦𝗘𝗥𝗜𝗘𝗦 𝗪𝗜𝗡𝗦 𝘃 🇧🇩 𝗙𝗢𝗥 𝗭𝗜𝗠𝗕𝗔𝗕𝗪𝗘 💥💥💥
✅ Won the only Test
✅ Won the ODI seriesThe Bangladesh side was flyimg high after a 2-0 Test series win against Pakistan and an ODI series win against Australia — but now, they’re… pic.twitter.com/lgf7Wt8dgi
— Cricketangon (@cricketangon) July 9, 2026
హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ ద్వయాన్ని బెన్నెట్ విడదీశాడు. అక్కడితో బంగ్లా తడబడగా.. ఆతిథ్య జట్టు బౌలర్లు పుంజుకున్నారు. టెయిలెండర్లు పోరాడినా సరిపోలేదు. ఔట్ చేసి మ్యాచ్‌లను మలుపు తిప్పాడు. చివరి బ్యాటర్ షోరిఫుల్ ఇస్లాంను ఎవాన్స్ ఔట్ చేయగా 13 పరుగుల తేడాతో జింబాబ్వే విక్టరీ కొట్టింది. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది ఆతిథ్య జట్టు.