హైదరాబాద్, మే 18 (నమస్తేతెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది అర్హులైన పేద ప్రజలకు ముద్ర రుణాల మంజూరులో అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు వాపోయారు.
ముద్ర రుణాల్లో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు, స్వయం ఉపాధితో రాణించే యువకులకు సహకరించాలని కోరారు. ముద్ర రుణాల్లో 2014 నుంచి 2025 వరకు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.