హిమాయత్‌నగర్, జూన్ 13: రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పీ ప్రేమపావని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో నిర్వహించిన యూనియన్ కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.
అల్పాహార బిల్లులకు సంబంధించి రూ.23 కోట్ల పాత బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనానికి అవసరమైన నిత్యావసర వస్తువులు, సరుకులు, గ్యాస్, కోడిగుడ్లను ప్రభుత్వమే సైప్లె చేయడంతోపాటు స్లాబ్ రేట్ల్లు రూ.25కు పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు కమలారెడ్డి, నేతలు చక్రపాణి, ముంతాజ్, వసంత, కవిత, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.