కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 24 : కరీంనగర్ నగరపాలక సంస్థకు మరోసారి జాతీయ అవార్డు లభించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ సిటీ పథకంలో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ మెరుగైన పనితీరు చూపించి అవార్డు కైవసం చేసుకున్నది. ఇందులో భాగంగా పే జల్ సర్వేక్షన్లో జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైనట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించింది. అమృత్ సిటీ పథకంలో భాగంగా ఏ విభాగంలో అవార్డు వచ్చిందన్న విషయాన్ని వచ్చే నెల 5న ప్రకటించనున్నది.