దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన టీఆర్ఎస్ ఎన్నారై శాఖ
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): కేటీఆర్ జన్మదినోత్సవం నేపథ్యంలో టీఆర్ఎస్ పలు దాతృత్వ, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రి కా శాఖ పాలుపంచుకొంటున్నది. దక్షిణాఫ్రికాలోని తెలుగువారి కోసం శనివారం నుంచి రెండు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పల్స్ ఆక్సిమీటర్ల సేవలను ప్రారంభించింది. ఈ సేవలను పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎన్నారై దక్షిణాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు.