సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎల్వీ ప్రసాద్ వ్యవస్థాపకుడు డాక్టర్ గుళ్లపల్లి ఎన్ రావుకు అరుదైన అవకాశం లభించింది. యూకేలోని ఆక్స్ఫర్డ్లో 106వ ఆక్స్ఫర్డ్ ఆప్తమాలజికల్ కాంగ్రెస్లో 2023-డోయిన్ ఉపన్యాసం ఇచ్చినట్లు ఎల్వీప్రసాద్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆక్స్ఫర్డ్ ఐ హాస్పిటల్స్లో మొట్టమొదటి అకడమిక్ కంటి విభాగం, వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ రాబర్డ్ డోయిన్ అని, నేత్ర వైద్యశాస్త్రంలో ఆయనే మొట్టమొదటి బోధకుడని ఎల్వీపీఈఐ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రతిష్టాత్మక డోయిన్ ఉపన్యాస కార్యక్రమంలో తొలి భారతీయ వైద్యుడిగా డాక్టర్ గుళ్లపల్లి పాల్గొన్నట్టు దవాఖాన వర్గాలు వెల్లడించాయి.