హైదరాబాద్, జూన్4 (నమస్తే తెలంగాణ): సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మైనార్టీ సంక్షేమశాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే మైనార్టీ విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద రూ.20లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నది. స్ప్రింగ్ సీజన్ కోసం మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు 30వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది.