ఇల్లెందు/ భద్రాచలం, అక్టోబర్ 3: ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంక్షేమ శాఖలోని పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవైజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పరిధిలోని కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం 22వ రోజుకు చేరింది.
గురువారం గాంధీ జయంతి సందర్భంగా ఇల్లెందులో గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ ఎదుట డైలీవైజ్ వర్కర్ల ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. జేఏసీ నాయకులు ఏజే రమేశ్, హీరాలాల్, కౌసల్య, మాడే పాపారావు, అబ్దుల్ నబి మాట్లాడారు.
డైలీవైజ్ వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, జీవో నంబర్ 64ను తక్షణమే రద్దు చేయాలని, కార్మికులకు టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఐటీడీఏ పీవో జోక్యం చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మన్యం మోహన్రావు, తాళ్లూరి కృష్ణ, నాయకులు పాయం ముత్తయ్య, నాగేశ్వరరావు, స్వామి, మంగ, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, రామకళ, రాజు, పద్మ, జయ, స్వరూప, నాగులు, ప్రసాద్, భద్రయ్య, దాసు, పాయం ముత్తయ్య, మంగమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.