వెల్దండ : మా పార్టీ మా ఇష్టం. ఇందిరమ్మ ఇండ్లు ( Indiramma Houses ) మా ఇష్టం ఉన్నవారికి ఎవరికైనా ఇస్తామంటూ గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు , కాంగ్రెస్ నాయకులు ( Congress Leaders ) వాదిస్తున్నారని నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చౌదర్పల్లి గ్రామస్థులు ఆరోపించారు. గ్రామంలో సోమవారం పలువురు అర్హులైన గ్రామస్థులు తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇండ్లు ఉన్న వారి పేర్లు లిస్టులో ఉన్నాయని, ఇండ్లు లేక పట్టణాల్లోకి పోయి పని చేసుకుంటూ జీవించే పేదలకు ఇల్లు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని అడిగితే దబాయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి అర్హులైన వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.