ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 9 : ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మొలుగరం కుమార్‌కు చెందిన ‘సైటేషన్ ఇండెక్స్’ (అనులేఖన సూచిక) రివర్స్ గేర్‌లో నడవడం చర్చనీయాంశంగా మారింది. ఏ పరిశోధకుడికైనా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘సైటేషన్ ఇండెక్స్’ సాధారణంగా పైకి ఎగబాకుతుంది. కానీ, ఓయూ వీసీ సైటేషన్ ఇండెక్స్ ఒక్కసారిగా దాదాపు 150 పాయింట్లు దిగజారడం ఆసక్తికరంగా మారింది. గతంలో 733గా ఉన్న ప్రొఫెసర్ కుమార్ సైటేషన్ ఇండెక్స్ ఇటీవల 586కు దిగజారింది. ప్రస్తు తం 606గా ఉన్నది.
దీనిపై ‘నమస్తే తెలంగాణ’ ఆరా తీయగా.. గతంలో తనవని చెప్పుకున్న ఆర్టికల్స్‌ను ఆయన తన ప్రొఫైల్ నుంచి తొలగించడంతోనే సైటేషన్ ఇండెక్స్ దిగజారినట్టు తెలుస్తున్నది. తన పేరుపైనే ఉన్న దాదా పు 31 పరిశోధనా పత్రాలను ఆయన తన ప్రొఫైల్ నుంచి ఉపసంహరించుకున్నారు. ఇప్పటికీ వీసీ కుమార్ ప్రొఫైల్‌లో తనకు సంబంధంలేని ఆర్టికల్స్ సైతం ఉండటం గమనార్హం. ఆయన చదివింది సివిల్ ఇంజినీరింగ్. ఆయన పనిచేస్తున్నదీ అదే విభాగంలోనే. కానీ, ఎం కుమార్ పేరుతో ఉన్న ఏ ఆర్టికల్నైనా తనదే అని చెప్పుకొంటున్నారు. అసలు పూర్తిగా వేరుగా ఉన్న వైద్య సంబంధ పరిశోధనా పత్రాల్లో ఎం కుమార్ అని ఉంటే అది సైతం తనే సొంతం చేసుకుంటున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో పర్యటించిన సందర్భంగా వర్సిటీకి ఇచ్చిన హామీల అమలుకు రూ.2వేల కోట్లు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ‘వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఓయూ విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో ఆధునీకరించాలి.

యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి. పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు ఉచిత మెస్ సౌకర్యంతోపాటు పీజీ విద్యార్థులకు రూ.8వేలు, పీహెచ్డీ విద్యార్థులకు రూ.25వేల ఫెలోషిప్ చెల్లించాలి. ప్రభుత్వ జోక్యం లేకుండా విశ్వవిద్యాలయానికి స్వయంప్రతిపత్తి కల్పించాలి. క్యాంపస్ నుంచి పోలీస్‌స్టేషన్‌ను తరలించాలి. హాస్టల్ బిల్డింగ్‌లను ఆధునీకరించి, అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఉపాధి కల్పించేలా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి’ అని లేఖలో కోరారు.