ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సినీనటుడు అల్లు అర్జు న్ ఇంటిపై దాడి చేసినందుకు క్షమాపణ చె ప్పాలని, లేకుంటే చంపేస్తామని అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో కొందరు బెదిరిస్తున్నారని అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులు తెలిపారు. ఓయూ పోలీస్ స్టేషన్లో ఫి ర్యాదు చేశారు. ఫోన్ చేసి బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వారు మాట్లాడు తూ.. తమను బెదిరిస్తూ వందల కాల్స్ వస్తున్నాయని వాపోయారు. తమ నంబర్లను సో షల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారని చె ప్పారు. ఫోన్ కాల్స్ ఆగకపోతే వేలాది మంది విద్యార్థులతో కలిసి అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.