హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల సీనియర్ ఆచార్యుడు ప్రొఫెసర్ జీబీరెడ్డి అరుదైన అవకాశం దక్కించుకున్నారు. కొచ్చి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్ (ఎన్‌యూఏఎల్‌ఎస్) నూతన వైస్‌చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. వర్సిటీ చాన్స్‌లర్ కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నితిన్ జాంబార్ శుక్రవారం నూతన వీసీగా ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. జీబీరెడ్డి ఓయూ నుంచి ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేశారు. పీహెచ్డీ పూర్తిచేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. వాస్తవానికి ఓయూ వీసీ రేసులో జీబీరెడ్డి పేరు వినిపించినా ఆయనకు అవకాశం దక్కలేదు. తాజాగా జాతీయ విశ్వవిద్యాలయం వీసీగా అవకాశం దక్కించుకున్నారు.