హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తమ సంఘం కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం వారికి ‘అదర్ డ్యూటీ’ సౌకర్యం కల్పించింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రఘునందన్‌రావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత విద్య విభాగం, డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్, సచివాలయం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.