Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 13న నిర్వహించాల్సిన బీసీఏ రెండు, నాలుగో సెమిస్టర్ మెయిన్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజున పాలీసెట్ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలను తిరిగి ఈనెల 29న నిర్వహిస్తామని ప్రకటించారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.