Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీలలో పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 25వ తేదీ నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్టు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. రోజు మూడు సెషన్లలో 49 విభాగాల పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను వచ్చే నెల 20వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని సూచించారు. పరీక్షలను ఆన్లైన్ విధానంలో హైదరాబాద్ నగరంలో మాత్రమే నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రానికి 90 నిమిషాల ముందుగా చేరుకోవాలని సూచించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలకు www.ouadmissions.com, www.osmania.ac.in లో చూసుకోవచ్చని చెప్పారు.