Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల మేకప్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 26వ తేదీ లోపు నిర్వహించాలని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ తదితర కోర్సుల ఆరో సెమిస్టర్ ఇన్స్టంట్/మేకప్ ప్రాక్టికల్, ప్రాజెక్ట్, వైవా పరీక్షలను నిర్వహించి 26వ తేదీల్లోగా మార్కు మెమోలను ఓయూ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన ఫారాలను ఈ నెల 31వ తేదీలోగా తమ కార్యాలయంలో భౌతికంగా సమర్పించాలని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.