Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని లా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. మూడేండ్ల ఎల్ఎల్బీ, ఆనర్స్, ఐదేండ్ల బీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీకాం ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీబీఏ ఎల్ఎల్బీ కోర్సుల మూడో సెమిస్టర్ రెగ్యులర్, ఎల్ఎల్ఎం మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.