హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): మార్ఫన్ సిండ్రోమ్(జన్యుపరమైన రుగ్మత), తీవ్రమైన హెపటోపల్మనరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్న 14ఏండ్ల బాలుడికి ఉస్మానియా వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. గురువారం ఉస్మానియా దవాఖానలో వివరాలను వైద్యులు వెల్లడించారు. ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గోకవరానికి చెందిన 14ఏండ్ల బాలుడు జీ నిఖిల్‌రెడ్డి దీర్ఘకాలిక కాలేయ వ్యాధితోపాటు, మార్ఫన్ సిండ్రోమ్, హెపటోపల్మనరీ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్టు వెల్లడించారు.
బాలుడి తల్లి లివర్ దానం చేయగా.. గతనెల 7న డాక్టర్ సీహెచ్ మధుసూదన్ నేతృత్వంలోని వైద్యబృందం సర్జరీని విజయవంతంగా పూర్తిచేసిందని పేర్కొన్నారు. ఈ అరుదైన వైద్య చికిత్స చేసిన ఉస్మానియా వైద్య బృందాన్ని ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ అభినందించారు.