ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 9: జనాభా ఆధారంగా తక్షణమే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నియామకాలు చేపట్టాలని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. సుప్రీంతీర్పు అనంతరం అన్ని నియామక నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అవసరమైతే ఆర్డినెన్స్ సైతం జారీ చేస్తామని చెప్పి, ప్రస్తుతం కాలయాపన చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తార్నాకలోని తన కార్యాలయంలో బుధవారం వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. వర్గీకరణ అమలుచేస్తే దళితుల్లో ఏ కులానికీ అన్యాయం జరగదని అభిప్రాయపడ్డారు.