హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు. పేపర్‌కు రూ. 50 ఆలస్య రుసుముతో ఈనెల 10 వరకు, తత్కాల్ కింద ఈ నెల 11 నుంచి 13 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఇచ్చినట్టు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ శ్రీహరి తెలిపారు.
‘పది’ ప్రీ ఫైనల్ పరీక్షల సమయం మార్పు
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల సమయాన్ని పాఠశాల విద్యాశాఖ మార్చింది. మార్చి 6 నుంచి 15 వరకు నిర్వహించనున్నది. గతంలో మధ్యాహ్నం 1:15 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు నిర్వహించాలని ఆదేశించింది. తాజాగా ఈ పరీక్షలను మధ్యాహ్నం 12:15 నుంచి మధ్యాహ్నం 3:15 గంటల వరకు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. రంజాన్ ఉపవాసాలను పురస్కరించుకుని మార్పులు చేసినట్టు వెల్లడించారు. మధ్యాహ్న భోజనాన్ని మధ్యాహ్నం 12:15 గంటల లోపే వడ్డించాలని సూచించారు.