హైదరాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ): టూరిజం పాలసీ మొత్తం అక్షర గారడీగానే ఉన్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటకరంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదనడానికి ఈ బడ్జెట్ లెక్కలే నిదర్శనం. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం నూతన పాలసీని ఆవిష్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తగిన నిధులు కేటాయించకపోవడంపై విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. పర్యాటకా నికి బడ్జెట్లో కేవలం రూ.775 కోట్లతోనే సరిపెట్టి నిర్లక్ష్యం చూపింది.